ASF: వాంకిడి మండలం దాబా గ్రామంలో యూరియా సంచులు కడుగుతూ ప్రమాదవశాత్తు వాగులో చనిపోయిన మృతదేహాలను చూసి MLA కోవ లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆదివారం మృతుల కుటుంబాలను చూసి తీవ్ర దిగ్బ్రాంతం వ్యక్తం చేశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుండి అన్ని విధాల సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.