కృష్ణా: చల్లపల్లి మండలం మంగళాపురం ప్రధాన రహదారి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను కోరారు. ఆదివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళాపురం పీఏసీఎస్ అధ్యక్షులు పరుచూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి రోడ్డు నిర్మించాలని కోరారు. మంగళాపురం రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.