KMM: జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తవడానికి మిగులు భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో అధికారులతో జాతీయ రహదారుల నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఖమ్మం-దేవరపల్లి, నాగపూర్-అమరావతి జాతీయ రహదారుల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.