MDK: 120 ఏళ్ల క్రితం నిర్మించిన మహబూబ్ నహర్ కాలువ నిర్వహణ లేక అద్వానంగా మారింది. గత ప్రభుత్వం కోట్లు వెచ్చించి సిమెంటు లైనింగ్ వేసినా, సరైన నిర్వహణ లేకపోవడంతో హవేలి ఘనపూర్ మండలంలో పలుచోట్ల గండ్లు పడ్డాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో గండ్లు పడిన చోట నీరు ముందుకు వెళ్లడం లేదు. కాలువలో తుంగ, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి.