VKB: వర్షం పడుతున్న యూరియా కోసం రైతులు బారులు తీరారు. వికారాబాద్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఆదివారం ఉదయం నుంచి యూరియా కోసం భారీగా క్యూలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డుతున్నారు. యూరియాకు కొరత లేదని అధికారులు చెబుతున్నా, తమకు దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరిపడా యూరియాను అందించాలని రైతులు కోరుతున్నారు.