KDP: శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా పులివెందల జూనియర్ సివిల్ జడ్జి భార్గవి నేతృత్వంలోని బెంచ్ 2015 కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించింది. వివిధ మండలాల నుంచి వచ్చిన క్రిమినల్, సివిల్, ఎస్టిసి, సీసీ, గ్యాంబ్లింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించారు. ఈ కేసుల పరిష్కారం ద్వారా రూ. 10,41,680 విలువైన వివాదాలు సయోధ్యతో ముగిశాయి.