NLR: నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పోస్టర్ను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ కార్తీక్ శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, పశుసంవర్ధక శాఖ జేడీ రమేష్ నాయక్, డిఆర్వో విజయ్ కుమార్, ఆర్డీవోలు అనూష, పావని తదితరులు పాల్గొన్నారు.