లక్నో విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. లక్నో-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. రన్ వేపై వేగం అందుకున్న తర్వాత టేకాఫ్ విఫలమైంది. దీంతో పైలట్ అతికష్టంపై విమానాన్ని రన్వే మీద ఆపారు. దీంతో ప్రమాదం తప్పినట్లైంది. అయితే, ఈ విమానంలో ఎంపీ డింపుల్ యాదవ్ సహా 151 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.