BHPL: మహదేవపూర్ మండలం కాలేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీలో వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 6 గంటలకు 5,66,160 క్యూసెక్కుల నీరు చేరుతోందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. శనివారం నుంచి ఆదివారం వరకు 66 వేల క్యూసెక్కులు పెరిగింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల, భారీ వర్షాలతో గోదావరి వరద పెరుగుతోంది.