KDP: అట్లూరు మండలంలోని వేమలూరు వంతెన పైకి సగిలేరు నది జలాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో ఎమ్మార్వో సుబ్బలక్ష్మమ్మ, ఎస్సై రామకృష్ణ వంతెనపై రాకపోకలను శనివారం నుంచి నిషేధించారు. వారి ఆదేశాల మేరకు వేమలూరు విఆర్వో సుబ్బన్న, వీఆర్ఏ నాగేశం వంతెన దగ్గరకు చేరుకుని రహదారిపై అడ్డుగా కంపవేసి రాకపోకలను పూర్తిగా నిషేధించామని సూచించారు.