GNTR: తురకపాలెంలో మరణమృదంగం కలకలం రేపింది. ఐతే మరణాలకు గల కారణాలు ఆ ప్రాంతంలోని యురేనియం అవశేషాలే అన్నట్లు చెన్నై ప్రయోగశాల నిర్ధారణ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల నమూనాలను సేకరించి చెన్నై ల్యాబ్‌కు పంపగా ఈ విషయం వెల్లడైంది. ఆ ప్రాతంలో క్వారీలు ఉండటంతో అక్కడ నీటిని పలు సమయాల్లో వాడటంతోనే సమస్య ఏర్పడిందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.