కోనసీమ: మలికిపురం పట్టణంలోని విశ్వేశ్వరాయపురం హెచ్పీ పెట్రోల్ బంకు నుంచి వంతెన వరకు ప్రధాన రహదారి అధ్వానంగా తయారయింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనాలు జారిపోతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.