PLD: చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో ఇవాళ మంత్రి గొట్టిపాటి రవికుమార్ 60 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 5 మందికి ఎల్వోసీలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అలాగే, లబ్ధిదారులకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలు అందజేస్తున్నామని తెలిపారు.