AP: సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా మంత్రి లోకేష్ ఘన నివాళులర్పించారు. ‘ఇంజనీరింగ్ రంగంలో ఆయన సేవలు నిరుపమానం. దేశ భవిష్యత్ జలాశయాలే అని నమ్మి తాగు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. తన ప్రతిభతో నవ భారత నిర్మాణానికి కృషిచేశారు. ఇంజనీర్లకు మార్గదర్శి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు.