AP: మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇవాళ బీజేపీలో చేరనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఏడాది క్రితం పోతుల సునీత ఎమ్మెల్సీ పదవి, వైసీపీకి రాజీనామా చేశారు. పోతుల సునీత 2017లో తొలిసారి టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయితే, 2020 నవంబరులో వైసీపీలో చేరిన ఆమె మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఏడాది క్రితం పదవికి రాజీనామా చేశారు.