VZM: గ్రంథాలయ ఉద్యమ నేత గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి వేడుకలను గాజులరేగ శాఖా గ్రంథాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల కమిటీ కన్వీనర్ బి. రామభద్రరాజు మాట్లాడుతూ.. యువత గాడిచర్లను స్ఫూర్తిగా తీసుకొని గ్రామ గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్యాడ ప్రసాద్ పట్నాయక్, రవుఫ్ పాల్గొన్నారు.