MBNR: ప్రెస్ క్లబ్ విషయంలో ఎటువంటి అవకతవకాలకు తావులేదని జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేందర్ చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు పనిగట్టుకుని అనవసరంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గంపై ఆరోపణలు చేస్తున్నారని అటువంటి ఆరోపణలను నిరూపించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు.