MDK: మండలం మక్త భూపతిపూర్‌లో వరదలకు కొట్టుకుపోయిన వంతెన పునఃనిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీనిపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదివారం వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. దీనిపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.