KDP: పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, ఎరువుల ధరలు తగ్గించాలని, యూరియా కొరత నివారించాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. మిర్చి, అరటి, చీని, టమోటా, ఉల్లి వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.