WGL: రాష్ట్రంలో యూరియా ఎరువుల సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణమని బీజేపీ రాయపర్తి మండల అధ్యక్షుడు నూనె అనిల్ యాదవ్ విమర్శించారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా యూరియా సరఫరా చేస్తోందని, అయితే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లోపాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అనిల్ తెలిపారు.