E.G: గోకవరం మండల కేంద్రంలో రంప ఎర్రంపాలెం గ్రామానికి వెళ్లే దారి గుంతలమయంగా మారింది. తిరుమల పాలెం, గంగంపాలెం, మల్లిశాల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా పాడవడంతో వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.