KMR: తాడ్వాయి మండల పరిధిలోని సోమారం తండా, అన్నారం తండాల్లో ఆదివారం ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి డా.ఖాసీం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవుల్లో సైతం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా గ్రామాల్లో, తండాల్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.