పెద్దపల్లి కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సంబంధిత వ్యాధితో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి అత్యవసర సమయంలో రక్తం అవసరం ఏర్పడగా, జూలపల్లి గ్రామానికి చెందిన గంగిపల్లి విద్య సాగర్ (26) స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 26వ సారి రక్తదానం చేశాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనలో యువకుడిని పలువురు అభినందించారు.