SRCL: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి ఆదివారం హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన గూడూరి మనోహర్ అనే వ్యక్తి ఇలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.