మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని పని చేయనున్నట్లు తెలుస్తోంది. ‘మిరాయ్’ సినిమాతో మ్యాజిక్ చేసిన కార్తీక్.. ఈ సినిమాకు ఎలాంటి అవుట్‌పుట్ ఇవ్వనున్నాడని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ అక్టోబర్ 2న సెట్స్ మీదకు వెళ్లనుంది.