SRD: చిన్నతనంలోని కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం అభినందనీయమని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్లో కరాటే బ్లాక్ బెల్ట్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మరక్షణకు కరాటే అవసరమని చెప్పారు. అనంతరం బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.