BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి నర్సరీలో ఆదివారం సింగరేణి సీఎండీ బలరాం ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన MLA గండ్ర సత్యనారాయణ రావు, బలరాంతో కలిసి 370 మొక్కలు నాటారు. MLA మాట్లాడుతూ.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిఎం రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.