KMM: కూసుమంచి మండల మునిగేపల్లికి చెందినరైతు సంఘం, CPM నాయకులు అయినాల వెంకటేశ్వరరావు ఆదివారం గుండెపోటుతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న CPM డివిజన్ కార్యదర్శి బండి రమేష్ వారి భౌతికకాయాన్ని సందర్శించి ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.