అన్నమయ్య: కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని ఎల్లవేళలా అండగా ఉంటామని మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నిస్సార్ అహ్మద్ భరోసా ఇచ్చారు. ఇవాళ నిమ్మనపల్లె మండలంలో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయనతోపాటు కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.