NZB: నగరంలోని కోటగల్లి పద్మశాలి వసతి గృహానికి సంబంధించిన ఎన్నికలు ఆదివారం పద్మశాలి ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఈ ఎన్నికల్లో 894 ఓట్లకు గాను 757 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 85 శాతం పోలింగ్ నమోదైంది. 11 పదవులకు 34 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.