GDWL: దయానంద విద్యా సమితి పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో గద్వాల్లో ఈరోజు ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా బీపీ చెకింగ్, మందులు అందిస్తున్నారు. ఈ ఆదివారం వైష్ణవి ఆసుపత్రికి చెందిన డాక్టర్ వరలక్ష్మి (స్త్రీ వ్యాధి నిపుణురాలు) దాదాపు 80 మంది మహిళలకు ఉచిత వైద్య సేవలు అందించారు.