PDPL: ఎలిగేడు మండలంలోని శివపల్లి, దూళికట్ట గ్రామాల్లోని వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు 680 బస్తాల యూరియాను ఎటువంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి ఉమాపతి తెలిపారు. దీంతోపాటు 250 బాటిళ్ల నానో యూరియా ప్లస్‌ను కూడా రైతులకు అందించి, దాని వాడకం వల్ల సుడిదోమ, అగ్గి తెగులు ఆశించకుండా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.