కృష్ణా: విజయవాడ గొల్లపూడిలో ఉన్న మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామి దేవస్థానం భూములపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు గాను 56 రోజుల పాటు రూ.45 లక్షలకు సదరు భూములను లీజుకు తీసుకున్నామన్నారు. భవిష్యత్తులో కూడా మరింత ఆదాయం దేవస్థానానికి వచ్చేలా కృషి చేస్తామన్నారు.