E.G: నిడదవోలు మండలం కాటకోటేశ్వరంలో ఇటీవల పాముకాటుతో మృతి చెందిన జనసేన కార్యకర్త వాసంశెట్టి రామకృష్ణ కుటుంబానికి మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం రూ. 5 లక్షల భీమా చెక్కును అందజేశారు. జనసేన క్రియాశీల సభ్యత్వం ఉండటంతో పార్టీ నుంచి వచ్చిన భీమా సొమ్మును మంత్రి కుటుంబ సభ్యులకు అందజేశారు. జనసేన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.