E,G: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 384.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. తాళ్లపూడి మండలంలో అత్యధికంగా 80.2 మి.మీ వర్షం కురిసిందన్నారు. మండలాల వారీగా రాజానగరం 23.8, కోరుకొండ 26.6, ఉండ్రాజవరం 3.2, రాజమండ్రి అర్బన్ 28.6, రూరల్ 18.4, కడియం 38.4, బిక్కవోలు 1.0, గోపాలపురం 50.4 మీ.మీ వర్షపాతం నమోదు అయిందన్నారు.