SRD: సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రోడ్డుపై నాట్లు వేసి సీపీఎం నాయకులు ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో రోడ్లు అధ్వానంగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యల పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.