సంగారెడ్డి: జిల్లాకు చెందిన బసవరాజ్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ముఖ్య సలహాదారుగా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని బీసీ సంఘం కార్యాలయంలో బసవరాజ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.