KRNL: జిల్లాలో ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 79 మందిని పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ప్రతి ఒక్కరికి రూ. 5 వేలు జరిమానా విధించింది. మొత్తం రూ. 3,95,000 జరిమానా వసూలైనట్లు సీఐ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురై కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు.