VSP: వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సారథ్యం సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని నిరూపించామన్నారు. ప్రజల అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు.