ADB: భీంపూర్ మండలంలోని కరంజి (టీ) గ్రామంలోని దేరడ్డి వామన్ ఇంటి గోడ అకాల వర్షానికి శనివారం కూలిపోయింది. వర్షం వల్ల మట్టి గోడ బలహీనపడి కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్తులు కోరారు.