RR: ప్రజలు తమ హక్కుల గురించి చైతన్యవంతులు కావాలని ప్రజా చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు నర్సింలు అన్నారు. షాబాద్ మండల కార్మిక సంఘం ప్రజా చైతన్య సమితి కార్యదర్శిగా బాలయ్య నియమితులు కాగా, వారికి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం నర్సింలు మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.