JN: ఈనెల 17న సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో జనగామలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పిలుపునిచ్చారు. స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అక్కేనపల్లి తిరుపతయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.