TG: ములుగు జిల్లా మేడారంలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ క్రమంలో మహాజాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. ‘మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలి. కొందరు స్వార్థం కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. మేడారం గద్దెలు మారుస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేడారం అభివృద్ధిపై DPR ఇంకా సిద్ధం కాలేదు. CM రేవంత్ మేడారంలో పర్యటించాకే ఫైనల్ డిజైన్లు సిద్దమవుతాయి’ అని స్పష్టం చేశారు.