ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మీరు నన్ను ఎంత తిట్టినా.. నేను శివ భక్తుడిని, విషం అంతా దిగమింగుతాను. కానీ, ఎవరికైనా అవమానం జరిగితే మాత్రం తట్టుకోలేను. డాక్టర్ భూపెన్ హజారికాకు భారతరత్న ఇవ్వడం మంచి నిర్ణయమా కాదా? కానీ, ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించినందుకు కాంగ్రెస్ పార్టీ అవమానించింది. నాది సరైన నిర్ణయమా.. కాదా?’ అని ప్రజలను మోదీ ప్రశ్నించారు.