KNR: జమ్మికుంట నుంచి ఉ. 5 గంటలకు, ఉ. 8 గంటలకు, సా. 5 గంటలకు గతంలో HYDకు సూపర్ లగ్జరీ బస్సులు ఉండేవి. ప్రస్తుతం వాటిని రద్దు చేశారు. మరో వారం రోజుల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో జమ్మికుంట నుంచి HYDకు బస్సులను పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. జమ్మికుంటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించినప్పుడు బస్సులు పునరుద్ధరిస్తానని అన్నారు.