MDCL: బాచుపల్లి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జగన్ స్టూడియో సమీపంలోని ప్రగతి నగర్లో ఉరివేసుకొని ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని చేరుకుపల్లి అంజలి (28) గృహిణిగా గుర్తించారు. ఆమె భర్త గోగు రాంబాబు, ఫ్లాట్ నం. 501, ప్రగతి నగర్ నివాసిస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.