HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్లో జయ ప్రకాష్ కాలనీ, ఇంజనీర్స్ కాలనీ ప్రజలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీలు, పలు సమస్యలను మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. వినతులపై వెంటనే పరిష్కారం చేస్తామన్నారు.