ELR: నగరంలోని స్థానిక 50వ డివిజన్ అరుణ్ జ్యోతిపేట నందు జరుగుతున్న గంగానమ్మ సంబరాల్లో ఆదివారం ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం భక్తిశ్రద్ధలతో ఎమ్మెల్యే అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.