BPT: చీరాల రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. అపస్మారక స్థితిలో కనిపించిన ఆ వ్యక్తిని గమనించిన రైల్వే పోలీసులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.