KMR: సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన శ్రీ బగలాముఖి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి క్రాంతి పటేల్ ఆదివారం తెలిపారు. ఈ పూజలు వ్యక్తుల గోత్రనామాలతో జరుగుతాయని, ప్రతిరోజూ అభిషేకాలు, అర్చనలు, మహామంత్ర జపం, కుంకుమార్చన, ఉంటాయని ఆయన వెల్లడించారు.